Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

థాంక్యూ బ్రదర్ అంటూ కేటీఆర్ కు తేజస్వి యాదవ్ రిప్లై

Tejashwi Yadav response to KTR tweet
  • ఆర్జేడీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీశ్ కుమార్
  • డిప్యూటీ సీఎంగా బాధ్యతలను స్వీకరించిన తేజస్వి 
  • తేజస్వికి శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్
బీహార్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఆర్జేడీ సహా 7 పార్టీల మద్దతుతో జేడీయూ అధినేత నితీశ్ కుమార్ 8వ సారి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలను స్వీకరించారు. మరోవైపు తేజస్వితో తెలంగాణ సీఎం కేసీఆర్ కు, మంత్రి కేటీఆర్ కు మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో తేజస్వికి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కొత్త బాధ్యతలతో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. కేటీఆర్ ట్వీట్ కు తేజస్వి  యాదవ్ రిప్లై ఇచ్చారు. 'థాంక్యూ బ్రదర్' అని ప్రతిస్పందించారు.
KTR
TRS
Tejashwi Yadav
RJD

More Telugu News